Wednesday, October 17, 2018

222 పోస్టులు 2 నోటిఫికేషన్లు!

🛑✍ 222 పోస్టులు 2 నోటిఫికేషన్లు!
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨                                                                             
❇ నెలాఖరులోగా విడుదలకు ఏపీపీఎస్సీ నిర్ణయం
🌍 అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి):                                                                                      ⬛ రాష్ట్రం లోని నిరుద్యోగులకు శుభవార్త. దాదాపు 222 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. 22 పోస్టులతో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్స్‌(ఎ్‌ఫఎ్‌సవో) నోటిఫికేషన్‌తో పాటు దాదాపు 200 పోస్టులతో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌(ఏఈఈ) నోటిఫికేషన్‌ విడుదలకు కమిషన్‌ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ నేతృత్వంలో మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నెలాఖరులోగా రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ విడుదలకు చర్యలు చేపట్టనున్నారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 తుది సిలబ్‌సలకు కూడా ఈ సమావేశం ఆమోదముద్ర వేసింది. గ్రూప్‌-1 డ్రాఫ్ట్‌ సిలబ్‌సలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

⬛ 📚 గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ సిలబస్‌ ఇలా...
ప్రస్తుతం గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఒకే పేపర్‌ను 150మార్కులకు నిర్వహిస్తున్నారు. ఇకపై జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ పేపర్లు ఒక్కోటీ 120 మార్కుల చొప్పున మొత్తం 240మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ నుంచి 1:12 నుంచి 1:15 నిష్పత్తిలో సామాజిక వర్గాల సమతుల్యతను అనుసరిస్తూ మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గతంలో ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసేవారు. యూపీఎస్సీ తరహాలో గ్రూప్‌ పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించిన ఏపీపీఎస్సీ... తొలిసారిగా ప్రిలిమ్స్‌లో నెగెటివ్‌ మార్కుల విధానాన్ని అమలు చేయనుంది. దీనిప్రకారం ప్రతి 3 తప్పు సమాధానాలకు 1 మార్కు కట్‌ చేస్తారు.

⬛📚 గ్రూప్‌-1మెయిన్స్‌ సిలబస్‌ ఇలా...
గ్రూప్‌-1 మెయిన్స్‌లో ఇంగ్లీషు(తప్పనిసరి క్వాలిఫైయింగ్‌)తో పాటు మరో 5డిస్ర్కిప్టివ్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా ఇకపై వీటికి అదనంగా తెలుగు(తప్పనిసరి క్వాలిఫైయింగ్‌) పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. అంటే ఇకపై 7పేపర్లు ఒక్కోటీ 150మార్కుల చొప్పున నిర్వహిస్తారు. కొత్తగా నిర్వహించే తెలుగు పరీక్షలో అనువాదం, వర్తమాన అంశాలపై ప్రశ్నలు, సంభాషణ, లెటర్‌ రైటింగ్‌, వ్యాసాలు, వ్యాకరణం వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన ఐదు డిస్ర్కిప్టివ్‌ టైపు పేపర్ల సిలబ్‌సను కూడా మార్చారు.

⬛ 📚 గ్రూప్‌-2లో కామన్‌ సిలబస్‌
డ్రాఫ్ట్‌ సిలబ్‌సలో మార్పులు లేకుండానే తుది సిలబ్‌సకు ఏపీపీఎస్సీ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ గ్రూప్‌-2 పోస్టులకు స్ర్కీనింగ్‌, మెయిన్స్‌ పరీక్షలు వేర్వేరు సిలబ్‌సలతో నిర్వహిస్తోంది. అయితే ఇకపై స్ర్కీనింగ్‌, మెయిన్స్‌కు కామన్‌ సిలబ్‌సను అమల్లోకి తీసుకురానుంది. మెయిన్స్‌లో 3పేపర్లకు ఉన్న సిలబ్‌సనే స్ర్కీనింగ్‌కు కూడా ఉంచాలని నిర్ణయించింది                                                                                      ⚫⚫⚫🌍🌍🌍🌍🌍⚫⚫⚫

No comments: