కానిస్టేబుల్ ఫలితాల వెల్లడి
🔹దేహదారుఢ్య పరీక్షకు 50.9% అర్హత
♦హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. సెప్టెంబరు 30న నిర్వహించిన పరీక్షకు హాజరైనవారిలో 50.9% అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
♦మొత్తం 16,925 కానిస్టేబుల్ తత్సమాన ఉద్యోగాల భర్తీకి నియామక మండలి ఈ సంవత్సరం మే 31న ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 4,79,158 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీశీలన తర్వాత 4,78,567 దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు 4,49,650 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష అనంతరం ‘కీ’ విడుదల చేసిన అధికారులు అభ్యంతరాలను అక్టోబరు 8 వరకూ స్వీకరించారు. తుది ‘కీ’ని అధికారి వెబ్‌సైట్లో ఉంచారు.
♦మూల్యాంకనం అనంతరం 2,28,865 మంది అభ్యర్థులు దేహదారుఢ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షకు అర్హత పొందారు. అత్యధికంగా ఎస్సీ విభాగంలో 69.14% అభ్యర్థులు అర్హత సాధించగా ఓసీ విభాగంలో అత్యల్పంగా 29.38% అర్హతపొందారు. మొత్తం 200 మార్కులకు అత్యధికంగా 151 మార్కులు, అత్యల్పంగా 12 మార్కులు వచ్చాయి. తదుపరి పరీక్షల ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని, పార్ట్-2 దరఖాస్తు పత్రాన్ని అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లోనే సమర్పించాలని నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.

No comments:
Post a Comment