📚✍బాలికలకు
అపూర్వ అవకాశం✍📚
♦సుకన్య సమృద్ధి యోజన ప్రారంభ ఖాతాను తగ్గించిన ప్రభుత్వం
♦రూ. 250 తోనే డిపాజిట్ చేసుకునే వెసులుబాటు
🔺బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాలికల సంక్షేమం కోసం ‘సుకన్య సమృద్ధి పథకం’ను 2015 జనవరి 22న ప్రారంభించారు. బాలికల భవిష్యత్తుకు ఈ పథకం చాలా ఉపయోగకరమైంది. ఇందులో చేరాలంటే తపాలా కార్యాలయాల్లో గతంలో రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ డిపాజిట్ను సవరించి కేవలం రూ.250తోనే సుకన్య సమృద్ధి పథకం ఖాతాను తెరిచే అవకాశం కల్పించింది.
🌻పుట్టిన శిశువు నుంచి పదేళ్లలోపు ఉన్న బాలికల పేరున వారి తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు సుకన్య సమృద్ధి పథకానికి సంబంధించిన ఖాతాను దగ్గర్లో ఉన్న తపాలా కార్యాలయాల్లో తెరవవచ్చు. ఈ ఖాతా కాలపరిమితి 21 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక బాలికకు ఒక ఖాతా వంతున ఇద్దరు బాలికల వరకు హెడ్ పోస్టాఫీసు, సబ్, బ్రాంచి తపాలా కార్యలయాల్లో ఖాతా తెరవొచ్చు.
🌻సవరించిన ధర ప్రకారం రూ. 250 డిపాజిట్తోనే మొట్ట మొదట దీన్ని ప్రారంభించవచ్చు. తరువాత డిపాజిట్లు వందలలో ఉండేలా కొనసాగించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతా కనీస మొత్తం రూ.వెయ్యి మొదలు. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు చెల్లించవచ్చు. ఈ ఖాతాలో డిపాజిట్లకు ఖాతా తెరచిన నాటి నుంచి 14 ఏళ్లు పూర్తయ్యేవరకు చెల్లించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 8.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. తరువాత వడ్డీ ఎప్పటికప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం చెల్లిస్తారు. 14 సంవత్సరాలు పూర్తయ్యేవరకు ఈ ఖాతాలకు వడ్డీ, చక్రవడ్డీ రూపంలో జమ చేస్తారని తపాలా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
🌻బాలికకు 18 ఏళ్లు నిండిన తరువాత చదువు లేదా వివాహం కోసం ఈ ఖాతాలో ముందు ఆర్థిక సంవత్సరం నిల్వలో 50 శాతం నగదును తీసుకోవచ్చు. 21 సంవత్సరాలు పూర్తి కాగానే ఖాతాను ముగించుకోవచ్చు. ఒకవేళ అలా చేయకపోతే ఖాతాలో ఉన్న నిల్వపై వడ్డీని.. అది ముగించేవరకు జమ చేస్తారు. ఖాతాను ఏ తపాలా కార్యాలయానికైనా బదిలీ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుం

No comments:
Post a Comment