Wednesday, October 3, 2018

APPSCrECRUITMENT

HURRY UP GUYS:


♦ఎస్‌ఎస్‌ఏలో 1929 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు

♦మరో 450 బోధనేతర పోస్టులు ఏజెన్సీల ద్వారా భర్తీ

💥ఈనాడు, అమరావతి:

 🌻సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ)లో ఒప్పంద, పొరుగుసేవల పోస్టుల భర్తీకి కసరత్తు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,379 పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. వీటిల్లో బోధన పోస్టులు 1,929, బోధనేతర పోస్టులు 450 ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు బోధన పోస్టులను నియామక పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. బోధన పోస్టులు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 455 ఖాళీగా ఉండగా.. బోధనేతర పోస్టులు కర్నూలు జిల్లాలో 104 ఉన్నాయి.

*గతంలో అన్ని పోస్టులను పొరుగుసేవల ఏజెన్సీల ద్వారా భర్తీ చేయాలని ఎస్‌ఎస్‌ఏ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా 12 సంస్థలను ఎంపిక చేసి, వాటికి జిల్లాల్లో నియామక బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రక్రియలో దళారులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో సీఎం ఆదేశాల మేరకు నియామక ప్రక్రియను నిలిపివేశారు.

🌻తాజాగా జిల్లాలవారీగా రాత పరీక్ష ద్వారా బోధన పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కలెక్టర్‌ అధ్యక్షతన డీఈడీ కళాశాల ప్రిన్సిపల్‌, జిల్లా విద్యాధికారి, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. బోధన పోస్టులు ఎక్కువగా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఉన్నాయి. ఇటీవల తాత్కాలిక పద్ధతిలో వీటిల్లో ఉపాధ్యాయులను నియమించారు. వీరూ ఈ పరీక్షను రాయాల్సి ఉంటుంది.

* బోధనేతర సిబ్బంది పోస్టులను ఎస్‌ఎస్‌ఏ ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఉండే కమిటీ భర్తీ చేస్తుంది.

No comments: