Wednesday, October 17, 2018

📍డీఎస్సీకి 800పోస్టులే అప్పగింత📍


📍డీఎస్సీకి 800పోస్టులే అప్పగింత📍

📍1,100 నియామకాలను నేరుగా భర్తీ చేసుకోనున్న గిరిజన సంక్షేమ శాఖ

☘ఈనాడు, అమరావతి:☘

♦పాఠశాల విద్యాశాఖ నిర్వహించే డీఎస్సీ ద్వారా 800 పోస్టుల భర్తీకి మాత్రమే గిరిజన సంక్షేమ శాఖ అనుమతి తెలిపింది. మిగతా గురుకుల పాఠశాలల్లోని 1,100 పోస్టులను ఆశాఖనే నేరుగా భర్తీ చేసుకోనుంది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 750 పోస్టుల భర్తీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖకు అప్పగించేందుకు ఆశాఖ నిరాకరించింది. ఈ నేపథ్యంలో మొత్తం 7,675 పోస్టులకే పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది.

📍షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలలు - 500, నాన్‌ షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలలు -300, పాఠశాల విద్యాశాఖ - 5వేలు, పురపాలక పాఠశాలలు -1100, ఏపీఆర్‌ఈఐ సొసైటీ -175, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు -350, ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు -250కు డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

 🔥25వ తేదీన నియామక పరీక్ష ప్రకటన:   
                                                                                                                  🚩ఉపాధ్యాయ నియామక పరీక్ష, అర్హత పరీక్ష(టెట్‌)లు కలిపి నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈనెల 25 నాటికి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.మరోవైపు ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్ల రిజర్వేషన్‌ రోస్టర్‌ దస్త్రానికి సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది.

🔸♦🔹🔸♦🔹🔸♦🔹

No comments: